There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
ఇనుము, ఉక్కు, వస్త్రాలు, ఆటోమొబైల్ వంటి పరిశ్రమలు భారతదేశ జీడీపీలో దాదాపు 25% వాటాను అందిస్తాయి. అయితే, వీటి స్థాన నిర్ణయం అనేది విభిన్న అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలకు ముడి పదార్థాలు మరియు శక్తి అవసరం, వస్త్ర పరిశ్రమలు కార్మిక శక్తి మరియు నీటిపై ఆధారపడతాయి, అటోమొబైల్ పరిశ్రమలు నైపుణ్యం కలిగిన కార్మికులు, రవాణా సౌలభ్యం మరియు వినియోగదారుల మార్కెట్‌లు ఉన్న నగరాల సమీపంలో వృద్ధి చెందుతాయి.
విషయం:
పరిశ్రమల స్థానాన్ని ప్రభావితం చేసే అంశాలు
1. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ a. ముడి పదార్థ సామీప్యం:
-ఇనుము గనులు మరియు బొగ్గు గనుల సమీపంలో ఈ పరిశ్రమలు స్థాపించబడతాయి. (ఉదా., సింగ్‌భూమ్ మరియు రాణిగంజ్ సమీపంలో జంషెడ్‌పూర్).
b. రవాణా సౌలభ్యం:
-రైల్వే జంక్షన్లు, ఓడరేవులకు సమీపంలో ఈ పరిశ్రమలు స్థాపించడం వల్ల రవాణా సులభం అవుతుంది.
c. నీరు మరియు శక్తి లభ్యత:
-పెద్ద మొత్తంలో నీరు మరియు అవిచ్ఛిన్న విద్యుత్ సరఫరా ఉన్న ప్రాంతాలు వీటికి అనుకూలంగా ఉంటాయి.
d. కార్మికులు మరియు మార్కెట్:
-నైపుణ్యం గల కార్మికుల లభ్యత మరియు సమీపంలోని వినియోగ పరిశ్రమలు వీటి స్థాపనకు అనుకూలం.
e. ప్రభుత్వ సహకారం:
-స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAIL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఉక్కు విధానం 2017 మరియు ప్రత్యేక ఉక్కు కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం( PLI పథకం) వంటి విధానాలు అమలు చేస్తూ ఈ పరిశ్రమలను ప్రోత్సహింస్తున్నాయి.
2. వస్త్ర పరిశ్రమ (పత్తి)
a. ముడి పదార్థ సరఫరా:
-పత్తి పండే ప్రాంతాల సమీపంలో (ఉదా., గుజరాత్, మహారాష్ట్ర) ఈ పరిశ్రమలు ఎక్కువగా స్థాపిస్తారు.
b. వాతావరణం:
-ముంబై వంటి తీర ప్రాంతాల్లో ఆర్ద్ర వాతావరణం నూలు వడకటానికి అనుకూలంగా ఉంటుంది.
c. నైపుణ్య కార్మికులు:
-నగర సముదాయాల్లో చౌకైన కార్మిక శక్తి లభిస్తుంది కాబట్టి వీటి స్థాపనకు ఈ ప్రాంతాలు అనుకూలం.
d. ఎగుమతి ఓడరేవులు:
-ముంబై మరియు కాండ్లా సమీపంలో ఎగుమతి సౌలభ్యం కోసం వీటిని స్థాపిస్తారు.
e. విధాన ప్రోత్సాహం:
-PM-MITRA పార్కులు, సాంకేతిక వస్త్ర మిషన్ వంటి పథకాలు వస్త్ర కేంద్రాలకు మద్దతు ఇస్తాయి.
3. ఆటోమొబైల్ పరిశ్రమ
a. మార్కెట్ సామీప్యం:
-ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు, పూణే, చెన్నై వంటి పెద్ద నగర మార్కెట్లకు సమీపంలో ఈ పరిశ్రమలు స్థాపిస్తారు.
b. భాగాల సరఫరా వ్యవస్థ:
-చెన్నై, పూణే, బెంగళూరులో సహాయక పరిశ్రమల సమూహాలు ఏర్పాటు చేస్తారు.
c. రవాణా అనుసంధానం:
-మంచి రహదారులు, ఓడరేవులు (చెన్నై, ముంబై), రైల్వే సౌలభ్యం వీటి స్థాపనకు అనుకూలంగా ఉంటుంది.
d. విధాన ప్రోత్సాహకాలు:
-ఆటోమోటివ్ PLI పథకం, FDI విధానాలు, EV ప్రోత్సాహకాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి.
e. నైపుణ్య కార్మికులు మరియు సాంకేతిక సౌలభ్యం:
-ఇంజనీరింగ్ సంస్థలు మరియు సాంకేతిక, మానవశక్తి లభ్యత గల ప్రదేశాలు ఈ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయి.
ఆర్థికాభివృద్ధికి దోహదం
1. ఉపాధి సృష్టి:
a. కార్మిక ఆధారిత వస్త్ర పరిశ్రమలు 45 మిలియన్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి.
b. ఆటోమొబైల్ మరియు ఇనుము-ఉక్కు పరిశ్రమలు సరఫరా గొలుసుల ద్వారా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని అందిస్తాయి.
2. ఎగుమతి ఆదాయం:
a. భారతదేశం వస్త్రాలు మరియు ఆటోమొబైల్ భాగాల ఎగుమతిలో అగ్రగామి.
b. ప్రపంచ డిమాండ్ కారణంగా ఉక్కు ఎగుమతులు పెరిగి, విదేశీ మారక నిల్వల పెరుగుదలకు దోహదపడ్డాయి.
3. పారిశ్రామిక వృద్ధి మరియు నగరీకరణ:
-పారిశ్రామిక కేంద్రాలు నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ మరియు అంతర్గత వలసలను ప్రోత్సహిస్తాయి.
4. విలువ జోడింపు మరియు తయారీ పెంపు:
-ఉక్కు మరియు ఆటో మొబైల్ రంగాలు ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు తయారీ జీడీపీకి మూలస్తంభాలుగా ఉండి, దేశీయ సామర్థ్యాలను పెంచుతాయి.
5. ప్రాంతీయ అభివృద్ధి:
-సమూహ ఆధారిత వృద్ధి తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు పారిశ్రామికీకరణను విస్తరించి, ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తుంది.
ముగింపు
భారతదేశ పరిశ్రమల స్థానిక గతిశీలత ఆర్థికాభివృద్ధి, ఉపాధి మరియు ఆవిష్కరణలను గణనీయంగా వేగవంతం చేసింది. PLI పథకం మరియు జాతీయ లాజిస్టిక్స్ విధానం (2022) వంటి సమకాలీన విధానాలు పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంచడం, ప్రాంతీయ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు స్థిరమైన విలువ గొలుసులను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవి భారతదేశాన్ని ప్రపంచ తయారీ మరియు ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలనే ఆకాంక్షను సాకారం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి.