There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Sun May 11, 2025
పరిచయం:
7,516 కిలోమీటర్లకు పైగా విస్తరించిన భారతదేశ తీరప్రాంతం, సంవత్సరానికి 1,400 మిలియన్ టన్నులకు పైగా సరుకును సరఫరా చేసే 12 ప్రధాన ఓడరేవులను కలిగి ఉంది. ఇవి భారతదేశం యొక్క విదేశి వాణిజ్యంలో 95% వాణిజ్యాన్ని సులభతరం చేస్తాయి. ప్రపంచ వాణిజ్యం WTO నేతృత్వంలోని సరళీకరణలు - FTA కారిడార్లు, డిజిటలైజ్డ్ లాజిస్టిక్స్ యుగంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, భారతీయ ఓడరేవులు ప్రస్తుత ఆర్థిక విధానాలు మరియు ఇండో-పసిఫిక్‌లో వాణిజ్య పోటీతత్వానికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.
విషయం:
A. భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు మరియు వాటి వ్యూహాత్మక పాత్రలు:
1. ముంబై ఓడరేవు (మహారాష్ట్ర):
a. ఇది చారిత్రాత్మక ఓడరేవు. బ్రేక్ బల్క్ సరుకు, పెట్రోలియం నిర్వహణ వంటివి ఈ బోర్డర్ అయ్యే ద్వారా జరుగుతున్నాయి.
b. ఉదాహరణ: సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల నుండి చమురును ఈ ఓడరేవు నుంచే దిగుమతి చేసుకుంటాము.
2. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT ముంబై) :
a. ఇది భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ ఓడరేవు.
b. ఉదాహరణ: ఆగ్నేయ ఆసియాతో ఎలక్ట్రానిక్స్, ఆటో విభాగాల వాణిజ్యాన్ని ఇది సులభతరం చేస్తుంది.
3. కాండ్ల ఓడరేవు (గుజరాత్)
a. ఇది డ్రై కార్గో కేంద్రం అంటే ఇక్కడ ద్రవ రూపంలో లేని వస్తువుల దిగుమతి జరుగుతుంది.
b. ఉదాహరణ: ఇండోనేషియా, మలేషియా నుండి ఆహార నూనెల దిగుమతులను నిర్వహిస్తుంది.
4. ముంద్రా ఓడరేవు (గుజరాత్)
a. అతిపెద్ద ప్రైవేట్ ఓడరేవు. b. ఉదాహరణ: ఆస్ట్రేలియా నుండి బొగ్గు, కతార్ నుండి LNG( ధ్రువీకృత సహజవాయువు) దిగుమతులకు కీలకం.
5. చెన్నై ఓడరేవు (తమిళనాడు)
a. తూర్పు తీరంలో ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రం.
b. ఉదాహరణ: హ్యుండాయ్, నిస్సాన్ కార్లను ఈ ఓడరేవు ద్వారా ఎగుమతి చేస్తాయి.
6. విశాఖపట్నం ఓడరేవు (ఆంధ్రప్రదేశ్)
a. అత్యంత లోతైన ఓడరేవు; ఇనుము ఖనిజం, బొగ్గు నిర్వహణ ఈ ఓడరేవులో ముఖ్యంగా జరుగుతుంది.
b. ఉదాహరణ: జపాన్, దక్షిణ కొరియాకు ఇనుప ఖనిజాల ఎగుమతులకు ప్రసిద్ధి.
7. పారాదీప్ ఓడరేవు (ఒడిశా)
a. ఖనిజాలు, థర్మల్ బొగ్గు ఎగుమతికి కీలకం.
b. ఉదాహరణ: మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు సేవలందిస్తుంది.
8. కోల్‌కతా-హల్దియా ఓడరేవు
a. ఇది నదీ తీర ఓడరేవు. ఈశాన్య భారతదేశం, భూటాన్లను అనుసంధానిస్తుంది.
b. ఉదాహరణ: అంతర్గత జలమార్గాల ద్వారా బంగ్లాదేశ్‌తో వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది.
B. WTO మరియు ప్రపంచ వాణిజ్య మార్పులు:
1. WTO చేసిన వాణిజ్య సరళీకరణలు:
-1995లో WTO సభ్యత్వం తర్వాత, భారతదేశం సుంకాలను తగ్గించి, పరిమాణాత్మక పరిమితులను తొలగించి, దిగుమతులను సరళీకరించింది. దీనితో మనదేశ వాణిజ్య విధానం ప్రపంచ నిబంధనలకు అనుగుణంగా మారింది.
2. ఎగుమతుల వైవిధ్యీకరణ:
-ప్రాథమిక వస్తువుల నుండి సాఫ్ట్వేర్ సేవలు, ఔషధాలు, ఆటోమొబైల్స్ వంటి విలువైన ఎగుమతులకు భారతదేశం నిలయంగా మారింది. ఇది ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంపొందించింది.
3. FTAలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాలు:
-WTO యొక్క బహుపాక్షిక చట్రం భారతదేశాన్ని ప్రాంతీయ FTAలలో (ఉదా., ASEAN, UAE) పాల్గొనేలా ప్రోత్సహించింది. దీనితో ప్రపంచ మార్కెట్లు, సరఫరా గొలుసులతో లోతైన అనుసంధానం ఏర్పడింది.
4. వివాదాల పరిష్కారం మరియు విధానాల సర్దుబాట్లు:
-భారతదేశం WTO యొక్క వివాద పరిష్కార విధానాన్ని చక్కగా ఉపయోగించుకుంది (ఉదా., సోలార్ ప్యానెల్ కేసు). ఇది సబ్సిడీలు, మేధో సంపత్తి హక్కులు, ఎగుమతి ప్రోత్సాహకాలలో విధాన సర్దుబాట్లకు దారితీసింది.
5. మౌలిక సదుపాయాల ఆధునీకరణ:
-WTO నేతృత్వంలోని వాణిజ్య సౌలభ్య ఒప్పందాలు భారతదేశాన్ని ఓడరేవు సామర్థ్యం, డిజిటల్ కస్టమ్స్, సాగరమాల వంటి కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టేలా చేశాయి. ఇది లాజిస్టిక్స్(రవాణా మరియు సరుకు నిర్వహణ) మరియు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచింది.
ముగింపు:
ప్రపంచ వాణిజ్యం కుంటుపడిన తర్వాత ప్రస్తుతం పునర్వ్యవస్థీకరణలో ఉన్న సమయంలో, భారతదేశ ఓడరేవులు డిజిటల్ మౌలిక సదుపాయాలు, పర్యావరణ స్థిరత్వం, WTO-అనుగుణ విధానాల ద్వారా నాయకత్వం వహించాలి. సాగరమాల, PM గతి శక్తి, ఇండో-పసిఫిక్ భాగస్వామ్యాల వంటి కార్యక్రమాలతో, ఓడరేవులు 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడంలో మరియు సముద్ర వాణిజ్య పాలనలో భారతదేశ నాయకత్వాన్ని స్థాపించడంలో ముందు వరుసలో నిలుస్తాయి.