There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Tue Jul 1, 2025
పరిచయం:
“ఒక వ్యక్తి యొక్క అయిష్టత అనేది లక్షల మంది భవిష్యత్తును బందీగా ఉంచలేదు,” అని సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రకటిస్తూ, హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి సైనిక చర్యకు ఆదేశించారు. నిజాం యొక్క విలీన నిరాకరణ, పెరుగుతున్న జాతి ఉద్రిక్తతలు, రజాకార్ల హింస, మరియు విఫలమైన దౌత్యం ఆపరేషన్ పోలో (1948)కు దారితీశాయి. మేజర్ జనరల్ జె.ఎన్. చౌధురి నేతృత్వంలో ఐదు రోజుల చర్య, ఇది హైదరాబాద్ సార్వభౌమత్వాన్ని ముగించి, భారతదేశ రాజకీయ ఏకీకరణను పూర్తి చేసింది.
విషయం:
I. మొదటి దశ (1853-1883):
ముల్కీ సమస్య యొక్క ప్రారంభ దశలు
A. వలస మరియు గైర్ ముల్కీల ఆవిర్భావం
1. 1857 తిరుగుబాటు తరువాత, అవధ్, పంజాబ్, మరియు ఢిల్లీ వంటి ప్రాంతాల నుండి చాలా మంది వలసదారులు హైదరాబాద్‌కు ఆశ్రయం మరియు ఉపాధి కోసం వచ్చారు.
2. ఈ వలసదారులు, తరచూ సాంప్రదాయ పాలక వర్గం నుండి లేదా పరిపాలన అనుభవం ఉన్నవారు. దాంతో ప్రభుత్వంలో ప్రముఖ స్థానాలను త్వరగా పొంది, స్థానిక ముల్కీలను వెనక్కి నెట్టారు.
3. మొదటి సలార్‌జంగ్ (ప్రధాన మంత్రి, 1853-1883) రాష్ట్రాన్ని ఆధునీకరించడానికి ఉత్తర భారతదేశం నుండి, ప్రధానంగా కాయస్థులు మరియు ఖత్రీలను నియమించడం ద్వారా మేధావులు మరియు నైపుణ్యం కలిగిన వారిని పిలిపించాడు.
4. ఈ సంస్కరణలు గైర్ ముల్కీల (బయటి వారు) ప్రభావాన్ని పెంచాయి, స్థానిక ముల్కీలకు ఉపాధి లేదా పదోన్నతులు పొందడం కష్టతరం చేసి, అసంతృప్తిని రేకెత్తించాయి.
B. మొదటి సలార్‌జంగ్ యొక్క పరిపాలన సంస్కరణలు
1. మొదటి సలార్‌జంగ్ రాష్ట్ర పరిపాలనను సంస్కరించారు. కానీ , గైర్ ముల్కీల నియామకం ముల్కీలలో అసంతృప్తిని కలిగించింది.
2. ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వారు ప్రభుత్వ ఉద్యోగాలలోకి ప్రవేశించడం వల్ల స్థానిక ముల్కీలు వెనుకబడ్డారు. దీంతో ఉద్యోగాల కోసం పోటీ పెరిగింది.
3. ఆయన సంస్కరణలు హైదరాబాద్‌ను ఆధునీకరించినప్పటికీ, ముల్కీలను ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకకు నెట్టివేయడమే కాక, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచాయి.
II. రెండవ దశ (1884-1911):
ఆరవ నిజాం హయాంలో భాషా మరియు విద్యా సంస్కరణలు
A. భాష మరియు ఉపాధి మార్పులు
1. ఆరవ నిజాం (మహబూబ్ అలీ పాషా) 1880లో ఫార్సీ స్థానంలో అధికారిక భాషగా ఉర్దూను ఆమోదించాడు. దీనివల్ల ఉర్దూ తెలియని అనేక ముల్కీలలో భాషా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
2. ఉర్దూ మరియు ఆంగ్లంలో నైపుణ్యం కలిగిన గైర్ ముల్కీలు కీలక పదవులను ఆక్రమించడం ప్రారంభించి ముల్కీలను మరింత వెనుకకు నెట్టారు.
3. 1886 యొక్క సివిల్ ఉద్యోగుల జాబితా ప్రకారం, ముల్కీలు 52% ఉద్యోగాలను కలిగి ఉన్నప్పటికీ, కేవలం 42% జీతం కేటాయింపును పొందారు. ఇది స్థానిక జనాభాలో అసంతృప్తిని రేకెత్తించింది.
B. ముల్కీ గెజిట్ పరిచయం (1888)
1. ఆరవ నిజాం 1888లో ముల్కీ హోదాను స్పష్టంగా నిర్వచించడానికి ఒక గెజిట్‌ను జారీ చేశారు. స్థానిక నివాసితులు కనీసం 12 సంవత్సరాలు హైదరాబాద్‌లో నివసించి ఉండాలని పేర్కొన్నారు.
2. అయినప్పటికీ, ఈ నిబంధనలు ఉన్నప్పటికీ, గైర్ ముల్కీలు, ముఖ్యంగా పరిపాలన మరియు రాజకీయ స్థానాలలో ఆధిపత్యం కొనసాగించారు.
III. మూడవ దశ (1911-1948): రాజకీయ పోరాటాలు మరియు గైర్ ముల్కీల ఆధిపత్యం A. విద్యా సంస్కరణలు మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం
1. ఏడవ నిజాం హయాంలో, స్థానిక విద్యను మెరుగుపరచడానికి మరియు ముల్కీలు ప్రభుత్వ సేవలలో పాల్గొనేలా చేయడానికి 1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
2. అయితే, విశ్వవిద్యాలయ స్థాపన మరియు పాఠ్యప్రణాళిక రూపకల్పనలో ఉత్తర భారతదేశం నుండి వచ్చిన గైర్ ముల్కీల ప్రభావం, తెలుగు మాండలికం కంటే ఉర్దూకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భాషా వివాదాలు తలెత్తాయి. ఇది స్థానిక యువతను మరింత దూరం చేసింది.
B. 1919 మరియు 1933 ఫిర్మానాలు
1. ముల్కీలలో పెరుగుతున్న అసంతృప్తిని పరిష్కరించడానికి, నిజాం 1919లో ఒక ఫిర్మాన్ జారీ చేసి, ముల్కీ హోదా మరియు ఉద్యోగ అర్హత ప్రమాణాలను స్పష్టం చేశారు.
2. 2.అయినప్పటికీ, గైర్ ముల్కీలు పరిపాలన స్థానాలను ఆధిపత్యం కొనసాగించారు.
3. 1933లో రెండవ ఫిర్మానా నియమాలను బలోపేతం చేసినప్పటికీ, గైర్ ముల్కీల ఆధిపత్యాన్ని పరిష్కరించలేకపోయింది. ఇది ముల్కీలు మరియు గైర్ ముల్కీల మధ్య విభేదాన్ని మరింత విస్తృతం చేసింది.
IV. హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనం (1948)
A. నిజాం పాలనలో రాజకీయ పోరాటాలు
1. 1947లో భారత స్వాతంత్ర్యం తరువాత, నిజాం భారతదేశంలో చేరడానికి నిరాకరించడం రాజకీయ పోరాటాలను తీవ్రతరం చేసింది.
2. హైదరాబాద్‌లో ఆర్థిక సవాళ్లు మరియు రాజకీయ అస్థిరత తెలంగాణ ప్రజల నుండి రాజకీయ ప్రాతినిధ్యం మరియు సమాన ఉపాధి అవకాశాల కోసం డిమాండ్‌ను పెంచి, విలీన సమస్యను మరింత సంక్లిష్టం చేసింది.
B. అంతర్జాతీయ పరిణామాల పాత్ర
1. భారత స్వాతంత్ర్యం మరియు సంస్థానాలలో విప్లవాత్మక ఉద్యమాలతో సహా అంతర్జాతీయ సంస్థమలు కూడా, నిజాంపై భారతదేశంలో చేరడానికి ఒత్తిడి తెచ్చింది.
2. భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యకు పూనుకోవడం వల్ల హైదరాబాద్ లొంగిపోయింది. దీంతో నిజాం పాలన ముగిసి, హైదరాబాద్ భారత యూనియన్‌లో అధికారికంగా విలీనమైంది.
C. పరిణామాలు మరియు వారసత్వం
1. అధికారిక విలీనం జరిగినప్పటికీ, తెలంగాణ ప్రాంతం ఆర్థిక మరియు రాజకీయ వివక్షను ఎదుర్కొంది. అంతేగాక పెద్ద మనుషుల ఒప్పందం నిబంధనలు కూడా విస్మరించబడ్డాయి.
2. ముల్కీ నిబంధనల ఉల్లంఘనా వారసత్వం అనేది నిరంతర ఆందోళనకు బీజం వేసి, చివరికి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసింది.
ముగింపు
1948 విలీనం సంస్థాన పాలనను ముగించినప్పటికీ, ప్రాంతీయ అసమానతలను తొలగించలేదు. మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (1953) నుండి తెలంగాణను మినహాయించడం, ముల్కీ రక్షణలను నిరాకరించడం, మరియు కాళోజీ నారాయణ రావు మరియు మర్రి చెన్నా రెడ్డి వంటి నాయకుల నేతృత్వంలో 1969 ఆందోళన, కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో 2014లో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసి ఏడు దశాబ్దాల అసంపూర్తికి శుభం పలికింది.