TGPSC GROUP-I MAINS ANSWER WRITING SERIES

Sun May 11, 2025

Q. తెలంగాణ యొక్క భౌగోళిక లక్షణాలైన భూస్వరూపాలు, వాతావరణం, నదులు మరియు నేలల గురించి తెలియజేస్తూ, ఈ అంశాలు రాష్ట్ర వ్యవసాయం మరియు ఆర్థిక వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో వివరించండి?

పరిచయం:
తెలంగాణ వ్యవసాయం దాని భౌగోళిక వైవిధ్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అనంతగిరి వంటి కొండలతో చెల్లాచెదురుగా ఉన్న గ్రానైట్ పీఠభూముల నుండి గోదావరి మరియు కృష్ణా నదుల సారవంతమైన ఒండ్రు మైదానాల వరకు ఈ విభిన్న భూదృశ్యం, అర్ధ-శుష్క వాతావరణంతో కలిసి, పంటల నమూనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది వనరుల నిర్వహణ పద్ధతులను రూపొందించడమే కాక, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో గతిశీలతను నిర్ణయిస్తుంది.

విషయం:
I. తెలంగాణ
యొక్క భౌగోళిక లక్షణాలు
A. భూస్వరూపాలు
1. తెలంగాణలో గ్రానైట్ కొండలు మరియు రాతి ఉపరితలంతో కూడిన హెచ్చుతగ్గుల పీఠభూమి ఉంది.
2. సాధారణంగా తెలంగాణ భూభాగం తూర్పు వైపుకు సాధారణంగా వాలి ఉండడంతో, నదుల పారుదలకు తోడ్పడుతుంది.
3. మహబూబ్‌నగర్ మరియు రంగారెడ్డి వంటి ప్రాంత నేలల్లో తేమ అధికంగా ఉండడం అనేది వ్యవసాయ రకాలను ప్రభావితం చేస్తాయి.

B.
వాతావరణం
1. తెలంగాణలో ఉష్ణమండల అర్ధ-శుష్క ఋతుపవన వాతావరణం ఉంటుంది.
2. వేసవి కాలంలో అత్యంత వేడి (45°C వరకు) ఉంటుంది. అదే చలికాలం సౌమ్యంగా ఉంటుంది.
3. నైఋతి ఋతుపవనాల (జూన్–సెప్టెంబర్) నుంచే ప్రధానంగా వర్షపాతం లభిస్తుంది.

C.
నదులు
1. ప్రధాన నదులు: గోదావరి, కృష్ణా మరియు వాటి ఉపనదులైన మూసీ, మంజీరా, ప్రాణహిత.
2. నదులు నీటిపారుదల, జలవిద్యుత్ మరియు పట్టణ నీటి సరఫరాకు జీవనాడులుగా పనిచేస్తాయి.
3. కాళేశ్వరం మరియు నాగార్జున సాగర్ వంటి ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు నదీ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నాయి.

D.
నేలలు
1. దక్షిణ జిల్లాలలో ఎర్రని ఇసుక నేలలు అధికంగా ఉన్నాయి.
2. ఆదిలాబాద్ మరియు కరీంనగర్‌లోని నల్ల రేగడి నేలలు వాణిజ్య పంటలకు తోడ్పడతాయి.
3. నదీతీర ఒండ్రు నేలలు వరి మరియు చెరకు సాగుకు అనువైనవి.

II. వ్యవసాయం మరియు ఆర్థిక వృద్ధిపై భౌగోళిక లక్షణాల ప్రభావం
A. వ్యవసాయంపై ప్రభావం 1. పంటల వైవిధ్యం:
-
వివిధ నేల రకాలు పత్తి, వరి, జొన్న, పప్పుధాన్యాలు మరియు నూనె గింజల వంటి పంటలు పండించడానికి ఎంతగానో దోహదపడతాయి.

2.
నీటిపారుదల నమూనాలు:
-
నదీ నీటిపారుదల పంటల ఉత్పత్తిని పెంచుతుంది. అయితే ఈ భూములు ఎక్కువగా ఋతుపవన వర్షాలపై ఆధారపడతాయి.

3.
ఉద్యానవన పంటల విస్తరణ:
-
ఇక్కడ ఉన్న సారవంతమైన నేలలు మామిడి, పసుపు మరియు కూరగాయల సాగుకు అణువుగా ఉండడంతో ఎగుమతుల కూడా ప్రోత్సహిస్తాయి.

4.
వర్షాధార సాగు ప్రాంతాలు:
-
అర్ధ-శుష్క ప్రాంతాలు జొన్న, ఎర్ర కంది వంటి సాంప్రదాయ ఆరుతడి పంటలు పండించడానికి అనువుగా ఉంటాయి.

5.
వ్యవసాయ మండళ్ళ ఏర్పాటు:
-
వర్షపాతం మరియు నేల ఆధారంగా ప్రాంతాలను వర్గీకరించడం ద్వారా లక్ష్యబద్ధమైన వ్యవసాయ ప్రణాళిక సాధ్యమవుతుంది.

B.
ఆర్థిక వృద్ధిపై ప్రభావం
1. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు:
-
సారవంతమైన నేలల చుట్టూ బియ్యం మిల్లులు, పత్తి జిన్నింగ్ మరియు నూనె తీసే పరిశ్రమలు స్థాపించబడ్డాయి.

2.
పారిశ్రామిక అభివృద్ధి:
-
నీటి లభ్యత హైదరాబాద్ సమీపంలో ఐటీ పార్కులు, ఫార్మా సిటీ మరియు పారిశ్రామిక ఎస్టేట్‌లకు ఊతమిస్తుంది.

3.
ఉద్యానవన ఎగుమతులు:
-
మామిడి మరియు పసుపు వంటి పంటలు తెలంగాణ ఎగుమతి ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడతాయి.

4.
జల వనరుల ఆధారిత చేపల సాగు:
-
గోదావరి డెల్టా ప్రాంతాల్లో జల వనరుల ఆధారిత చేపల సాగు పెరుగుతోంది.

5.
పర్యాటకం మరియు పర్యావరణ ఆర్థిక వ్యవస్థ:
-
శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ వంటి జలాశయాలు పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇస్తాయి.

ముగింపు
తెలంగాణ యొక్క సారవంతమైన భూభాగం, నదులు మరియు అర్ధ-శుష్క వాతావరణం దాని వ్యవసాయానికి బలమైన పునాదిని అందిస్తాయి. భారతదేశ వరి ఉత్పత్తిలో 12% మరియు పత్తి ఉత్పత్తిలో 10% తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుంది. మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం మరియు రైతు బంధు ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడం వంటి చర్యలతో రాష్ట్రం దీనిని మరింత బలోపేతం చేస్తుంది.